సర్జికల్‌ స్ట్రైక్స్‌ పై కేసీఆర్ షాకింగ్ కామెంట్స్

ఇటీవల పాకిస్థాన్ ఉగ్ర స్థావాలపై నిర్వహించిన స్ట్రైక్స్‌ దాడులపై తాజా ఎన్నికల ప్రచారం బీజేపీ గొప్పగా చెప్పుకొంటోంది. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీఏ హయాంలో నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు సర్జికల్‌ స్ట్రైక్స్‌ దాడులు 11 సార్లు జరిగాయి. బయటకు చెప్పరు. అవి వ్యూహాత్మక దాడులు. వాళ్లు చేస్తారు. మనం చేస్తాం. దానికి నరేంద్ర మోదీ మొన్న సర్జికల్‌ స్ట్రైక్‌ అంటే 300 మంది ఉగ్రవాదులు చనిపోయారని డొల్ల ప్రచారం చేశారు. చీమ కూడా చావలేదని జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌ మసూద్‌ అజర్‌ చెప్పాడు. ఈ ప్రచారాలతో మీరు ఓట్లు అడుగుతారా? ఇదేనా దేశాన్ని నడిపించే తీరుని విమర్శించారు.

మిర్యాలగూడలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ బహిరంగ సభలో ఓట్లు, రాజకీయాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్నే కాపీ కొట్టి ఆయుష్మాన్‌ భారత్‌ పథకం తీసుకొచ్చారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ఇచ్చేది చాలా తక్కువ, దానికంటే మెరుగ్గా ఆరోగ్యశ్రీ ఉన్నందునే తాను తిరస్కరించా. ఈ రెండింటిలో ఏది గొప్పదో చర్చకు రావాలని కేసీఆర్ సవాల్‌ విసిరారు.