గ్రేటర్’లో టీడీపీ ఖాళీ అయింది

గ్రేటర్ హైదరాబాదులో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యింది. గ్రేటర్ హైదరాబాదులోని ఏకైక టీడీపి కార్పోరేటర్ కారెక్కారు. కెపిహెచ్ బీ డివిజన్ కార్పోరేటర్ అయిన మందాడి శ్రీనివాస రావు తెరాసలో చేరారు. ఆయనకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు కారెక్కెశాడు. ఇప్పుడు గ్రేటర్ లోనూ ఆ పార్టీ ఖాళీ అయింది.

మరోవైపు, తెలంగాణ కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 10మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో చేరేందుకు నిర్ణయించుకొన్నారు. ఈ నేపథ్యంలో 88ఎమ్మెల్యేలుగా తెరాస బలం వందకు చేరుకొంది. ఈ చేరికల కారణంగా లోక్ సభ ఎన్నికల్లో తెరాసకి మరింత లాభించనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.