అందుకే గాజువాక ఎంచుకొన్నా

ఏపీ అసెంబ్లీ ఎన్నికలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు స్థానాల నుంచి పోటికి దిగిన సంగతి తెలిసిందే. గాజువాకతో పాటు భీమవరం అసెంబ్లీ స్థానానికి పవన్ పోటీ చేశారు. ఈ రెండింటిలో పవన్ ఎక్కడి నుంచి విజయం సాధిస్తారు. లేదంటే రెండు స్థానాల్లోనూ గెలుస్తారా అన్నది ఆసక్తిగా మారింది. పవన్ శనివారం గాజువాకలో ఎన్నికల ప్రచార రోడ్‌షో నిర్వహించారు.

ఈ సందర్భంగా 64 అంశాలతో కూడిన గాజువాక నియోజకవర్గ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్నో సమస్యలు ఉన్న గాజువాకను గత పాలకులంతా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. అందుకే తాను గాజువాక నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు పవన్‌ స్పష్టంచేశారు. జనసేన గెలిచిన తర్వాత అగనంపూడిని రెవెన్యూ డివిజన్‌ చేస్తానని హామీ ఇచ్చారు.