ప్రచారంలో దొంగలు పడ్డారు
ఎన్నికల వేళ రాజకీయ నాయకులు ప్రచారంలో పడ్దారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. దీంతో తమ అభిమాన నాయకులను చూసేందుకు ప్రజలు వందల, వేల సంఖ్యలో తరలివస్తున్నారు. ఇదే అదనుగా దొంగలు చెలరేగిపోతున్నారు. సమావేశాలకు హాజరవుతున్న వారి వస్తువులను, డబ్బులను చాకచక్యంగా కొట్టేస్తున్నారు.
తాజాగా వైకాపా అధ్యక్షుడు జగన్ సోదరి షర్మిల గుంటూరు జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా, అందరూ చూస్తుండగానే ఆమె చేతి ఉంగరాన్ని చోరీ చేసేందుకు యత్నించారు. అయితే, ఉంగరం పోయిందా? లేదా? అన్నది మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సభలకు హాజరయ్యే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Even leaders are not spared. Under the guise of hand shaking a ring from #YSSharmila hand was stolen during @YSRCParty election campaign. pic.twitter.com/L24KmaWfng
— dinesh akula (@dineshakula) March 31, 2019