పైత్యం : జాబు రావాలంటే మళ్లీ మళ్లీ బాబు రావాలి

‘జాబు రావాలంటే బాబు రావాలి’ ఇది టీడీపీ స్లోగన్. 2014 ఎన్నికల ప్రచారంలో ఈ స్లోగన్ ని గట్టిగా ప్రచారం చేశారు. అది వర్కవుట్ అయ్యింది కూడా. యువతని బాగా ఆకట్టుకొంది. నిజమే.. చంద్రబాబుకు అనుభవం ఉంది. జగన్ కుర్రోడు. కొత్తోడు. అనుకొన్నారు ఆంధ్రా ప్రజలు. నిజంగానే.. బాబు వస్తే జాబు వస్తుందని ఆశపడి ఆయన్ని గెలిపించారు. సీఎంని చేశారు. సీఎంగా చంద్రబాబు ఐదేళ్ల పాలన పూర్తయింది. కానీ, జాబు రాలేదు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలొచ్చాయ్.

ఐతే, ఈ సారి ‘జాబు రావాలంటే బాబు రావాలి’ స్లోగన్ ని టీడీపీ మరిచిపోయినట్టు అనిపించింది. కొత్త స్లోగన్ ని తీసుకొచ్చింది. అదే ‘మీ భవిష్యత్ మా బాధ్యత’. ఈ స్లోగన్ తో మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో కొన్ని ప్రచార వీడియోలని రెడీ చేయించింది. వాటిని టీవీ ఛానెన్స్ లో పదే పదే ప్రదర్శిస్తున్నారు. వాటిని చూసి నవ్వుకొనే వాళ్లు నవ్వుకొంటున్నారు. పచ్చ పార్టీ వాళ్లు మాత్రం.. బోయపాటి బిల్డప్ వీడియోలు బాగున్నాయంటూ మురిసిపోతున్నారు.

చంద్రబాబుకు మాత్రం కొత్త స్లోగన్ పై పెద్దగా నమ్మకం లేనట్టుంది. అందుకే పాత స్లోగన్ ‘జాబు రావాలంటే బాబు రావాలి’ను కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఆదివారం రాత్రి విశాఖ మున్సిపల్‌ మైదానంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ‘జాబు రావాలంటే మళ్లీ మళ్లీ బాబు రావాలి’ అంటూ కొత్త స్లోగన్ ఇచ్చాడు. బాబుని ఒక్కసారి సీఎం చేస్తే జాబు రాదు. ఆయన్ని మళ్లీ మళ్లీ సీఎం చేయాలి. మనం మాత్రం ఆయన జాబు ఇస్తాడని ఎదురు చూస్తూనే ఉండాలని అక్కడికొచ్చిన కుర్రాళ్లు గుసగుసలాడుకొంటున్నట్టు సమాచారమ్. అదీ నిజమే మరీ.. !