కోడలు సీక్రెట్ రొమాన్స్’పై నాగ్ ఫన్నీ కామెంట్స్
పెళ్లికి ముందే రొమాన్స్ చేసిన ప్రేమజంట నాగ చైతన్య-సమంత. ‘ఏం మాయ చేశావె’ సినిమాతో మొదలైన వీరి రొమాన్స్ నాన్ స్టాప్ గా కొనసాగుతూనే ఉంది. అప్పుడు ప్రేమికులుగా, ఇప్పుడు భార్యభర్తలుగా అంతే తేడా. ఐతే, పెళ్లికి ముందు సామ్-చై చేసిన సీక్రెట్ రొమాన్స్ నాగ్ బయటపెట్టాడు. పెళ్లి తర్వాత సామ్-చై తొలిసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 5న మజిలీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక జరిగింది.
ఈ వేడుకకి వెంకీతో పాటు నాగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాగ్ పెళ్లికి ముందు ‘మనం’ సినిమా షూటింగ్ సమయంలో సామ్-నాగ్ ల సీక్రెట్ రొమాన్స్ బయటపెట్టాడు. ‘ఆ సమయంలో వీరిద్దరు లవర్స్ అనే విషయం నాకు అస్సలు తెలీదు. అస్సలు డౌట్ రాకుండా వ్యవహరించేవారు. చాలా సీక్రెట్ రొమాన్స్ చేసుకొనేవారు’ అన్నారు నాగ్. మొత్తంగా.. చాలా తెలివిగా నాగ్ ని మోసం చేశారు సామ్-చై.