థమన్ మాయ చేశాడు


బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించడంలో స్పెషలిస్టుగా మారిపోయాడు థమన్. అది లవ్ స్టోరీ అయినా, ఫ్యాక్షన్ స్టోరీ అయినా థమన్ తనదైన స్టయిల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మాయ చేస్తున్నాడు. తొలిప్రేమ, అరవింద సమేత సినిమాలకోసం థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఆ సినిమాల స్థాయినే పెంచేసింది. దీంతో థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటేనే.. సినిమాపై ఓ నమ్మకం ఏర్పడుతోంది. ఇప్పుడు ‘మజిలీ’ విషయంలో అదే జరిగిందని చిత్రబృందం చెబుతోంది.

ఈ సినిమా గోపీ సుందర్ పాటలు అందించారు. ఐతే, కొన్ని కారణాల వలన ఆయన సినిమా నుంచి మధ్యంతరంగా తప్పుకొన్నారు. దీంతో సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం చిత్రబృందం థమన్ ని తీసుకొన్నారు. ఐతే, థమన్ మజిలీ కోసం అద్భుతమైన గ్రౌండ్ స్కోర్ అందించారట. ఆదివారం జరిగిన మజిలీ ప్రీ రిలీజ్ వేడుకలో థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై దర్శకుడు శివ నిర్వాణ, చైతూ, సామ్.. ప్రశంసల వర్షం కురిపించారు. థమన్ మాకు దేవుడులా దొరికడు. అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు అన్నారు.