మాజీ భార్య పెళ్లిపై అర్భాజ్ ఖాన్ రియాక్షన్
సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ మాజీ భార్య మలైకా అరోరా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. భర్తతో విడిపోక ముందు నుంచే ఆమె బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో ఎఫైర్ కొనసాగిస్తోంది. భర్తతో విడిపోయిన తర్వాత ఆ అక్రమ సంబంధాన్ని సక్రమ సంబంధం చేసుకొనేందుకు వీరి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. ఈ నెల 19నే పెళ్లి. చాలా తక్కువ మంది అతిథుల మధ్య మలైకా-అర్జున్ కపూర్ ల పెళ్లి జరగబోతున్నట్టు బాలీవుడ్ సమాచారమ్.
ఈ నేపథ్యంలో మాజీ భార్య పెళ్లిపై అర్భాజ్ ఖాన్ ని బాలీవుడ్ మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన ఆసక్తికర సమాధానం చెప్పాడు. ఈ ప్రశ్న అడగడానికి మీరు చాలా సమయం తీసుకున్నారు. దీనిపై స్పందించడానికి నాకు కొంత సమయం కావాలని తెలివిగా సమాధానం ఇచ్చాడు అర్భాజ్ ఖాన్. బహుశా.. అఫిషియల్ గా పెళ్లి డేటు వచ్చిన తర్వాత అర్భాజ్ ఖాన్ రియాక్ట్ అవుతాడేమో ! అప్పుడు మాజీ భార్యకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపి మంచి మనసును చాటుకుంటాడేమో. పవన్ కళ్యాణ్ మాదిరిగా.