చంద్రబాబు సొంతం బలం నమ్ముకొంటే మంచిదేమో.. !
ఏపీలో మరోసారి అధికారంలోకి రావడానికి సీఎం చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. జగన్ రూపాయి అంటే.. బాబు రూపాయిన్నర అంటున్నారు. అనకుంటే గెలిచే పరిస్థితి లేదు. ఇప్పటికే సర్వేలు వైకాపాకి అనుకూలంగా వస్తున్నాయి. ఆ ఫలితా
లని తారుమారు చేయాలంటే మేజిక్ చేయాలి. పక్కా వ్యూహాలని అమలు చేయాలి. ఆ పనిలో ఉన్నారు చంద్రబాబు. కలిసొస్తుందే
మోనని జాతీయ నేతలని రంగంలోకి దించుతున్నారు. కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, ఢిల్లీ సీఎం క్రేజీవాల్, ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీలని ఏపీకి తీసుకొచ్చారు. తనతో పాటు వాళ్లని ఎన్నికల ప్రచారం చేయించారు. ఐతే, వారి వలన మైనస్ తప్ప ప్లస్ కాలేదు.
ప్రచారం మాత్రమే కాదు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ జనసేన, ప్రజాశాంతి పార్టీలపై ఆధారపడినట్టు కనబడుతోంది. జనసేనతో లోపాయికారి ఒప్పందం జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. అదీ నిజమే అన్నట్టు ఈ రెండు పార్టీలు కొన్ని చోట్ల ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్నాయి. ఇక, వైకాపాని ఓడించేందుకు ప్రజాశాంతి పార్టీని చాలా తెలివిగా వాడుకొంటోంది టీడీపీ. ప్రజాశాంతి విమానం గుర్తితో ఫ్యాన్ ఓట్లకి గండికొట్టాలని చూస్తోంది. దీనికితోడు వైకాపా అభ్యర్థులతో దాదాపు సమానమైన వ్యక్తులని ఎంచుకొని ప్రజాశాంతి బీ-ఫాంతో బరిలోకి దింపింది. ఇటు ఎన్నికల ప్రచారం, అటు సీట్ల గెలుపులోనూ టీడీపీ పక్క నేతలు, పార్టీలపై ఆధారపడినట్టు కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో జనసేన సపోర్టుతో గెలిచిన టీడీపీ ఇప్పటికీ ఇతరులపై ఆధారపడుతుండటం గమనార్హం.