‘మన్మథుడు2’ ఫ్యామిలీని చూశారా.. ?

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ‘మన్మథుడు2’ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకొంది. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అనుకొన్న సమయంలో నాగ్ సప్రైజ్ ఇచ్చారు. తన ‘మన్మథుడు 2’ ఫ్యామిలీ అంటూ ఓ ఫోటోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో నాగ్, రకుల్ ప్రీత్ సింగ్, రాహుల్ రవీంద్రన్, రావు రమేష్, వెన్నెల కిషోర్.. తదితరులు ఉన్నారు. ఈ ఫోటోతో సినిమా రెగ్యూలర్ షూటింగ్ మొదలైపోయిందని చెప్పేశాడు నాగ్.

త్రివిక్రమ్ ని ‘మన్మథుడు’ చేసిన ఘనత త్రివిక్రమ్ ది. 2002లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘మన్మథుడు’ సూపర్ హిట్ అయింది. ఇందులో నాగ్-సోనాలీ బింద్రే జంటగా నటించారు. లవంగం పాత్రలో బ్రహ్మానందం కడుపుబ్బ నవ్వించేశాడు. సీక్వెల్ లోనూ లవంగం పాత్ర ఉండనుంది. ఆ పాత్ర కోసం వెన్నెల కిషోర్ ని తీసుకొన్నారు. ఈ సినిమాతో నాగ్ అప్పుడు ఇప్పుడు కూడా మన్మథుడే అని నిరూపించుకొంటాడేమో చూడాలి.