పోలవరం ఏటీఎం.. ! కాదు ఏటీడబ్ల్యూ.. !!


పోలవరం ఏపీ సీఎం చంద్రబాబుకు ‘ఏటీఎం’గా మారిందని విమర్శించారు ప్రధాని నరేంద్ర మోడీ. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం బీజేపీ నిర్వహించిన బహిరంగసభలో ప్రధాని పాల్గొన్నారు. ‘పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి తెదేపాకు లేదు. ఎప్పటికప్పుడు అంచనాలు పెంచుతూ ఎక్కువ డబ్బు పొందుతున్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఏటీఎంలా మారింది’ అని ప్రధాని విమర్శించారు. అంతేకాదు చంద్రబాబు భల్లాలదేవుడుని కామెంట్ చేశారు.

ప్రధాని తనపై చేసిన ఆరోపణలపై నిమిషాల్లోనే స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు. పోలవరం ఏటీఎం కాదు. ఏటీడబ్ల్యూ.
ఆంధ్రప్రదేశ్‌లో ఏటీడబ్ల్యూగా చేస్తాం. ‘ఎనీ టైం వాటర్‌’ అనే రీతిలో 24 గంటల నీటి సరఫరా చేస్తాని ప్రధాని విమర్శకి కౌంటర్ ఇచారు. రాష్ట్రానికి బాహుబలిగా ఉంటా. భల్లాల దేవుడు, బిజ్జల దేవుడు లాంటి జగన్‌, మోదీల నుంచి ఆంధ్రప్రదేశ్‌ని కాపాడతా.
నరేంద్ర మోదీ దేశానికి ప్రమాదకరం. మత విద్వేషాలను రెచ్చగొడుతూ విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు విమర్శించారు.

మొత్తానికి.. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబుల మధ్య ఆరోపణలు-ప్రతి ఆరోపణలతో ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఐతే, చంద్రబాబుని నేరుగా టార్గెట్ చేసిన మోడీ.. జగన్ మాత్రం చూసి చూడనట్టుగా వదిలేశాడు. జగన్ అవినీతి, కోర్టు కేసులపై ఒక్క కామెంట్ చేయలేదు. మోడీ తీరుతో బీజేపీ-వైకాపా రహస్యం ఒప్పందం నిజమనే విషయంలో మరింత క్లారిటీ వచ్చినట్టయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.