మోహన్ బాబుకు జైలు శిక్ష వెనక అసలు నిజాలు !


సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబుకు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ కోర్టు యేడాది జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ‘సలీం’ సినిమాకు సంబంధించిన వ్యవహారంలో దర్శకుడు వైవీఎస్‌ చౌదరి వేసిన చెక్ బౌన్స్‌ కేసులో ఈ శిక్ష పడింది. ఐతే, దీనిపై మోహన్ బాబు వర్షన్ మరోలా ఉంది. అసలు ఈ రూ. 40.50లక్షల చెక్కు బౌన్స్‌ కు సంబంధించి మోహన్ బాబు అసలు నిజాలని బయటపెట్టారు. ఈ మేరకు ఓ నోటుని విడుదల చేశారు డైలాగ్ కింగ్.

ఆ వర్షన్ ప్రకారం… “2009లో సలీమ్ సినిమా చేస్తున్న సమయంలోనే ఆ సినిమాకు సంబంధించిన మొత్తాన్ని దర్శకుదు వైవీఎస్ చౌదరికి చెల్లించాం. మా బ్యానర్ లో మరో సినిమా చేసేందుకు గానూ ఆయనకు రూ. 40.50లక్షల చెక్కుని ఇచ్చాం. సలీం సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో.. 40.50లక్షల వైవీఎస్ చౌదరితో చేయాల్సిన తదుపరి సినిమా వద్దనుకొన్నాం. ఈ విషయం ఆయనకి చెప్పాం. చెక్కని బ్యాంక్ లో వేయొద్దని చెప్పాం. ఆయన దాన్ని బ్యాంక్ లో వేసి.. చెక్ బౌన్స్‌ కేసు పెట్టారు. కోర్టుని తప్పుదోవ పట్టించారు. దాంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పుని మేము సెషన్ కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం” అని తెలిపారు.

అంతేకాదు.. తనని అరెస్ట్ చేసి జైలులో పెట్టినట్టు కొన్ని ఛానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. అందులో ఏమాత్రం నిజంలేదు. ప్రస్తుతం నేను ఇంట్లోనే ఉన్నాని తెలిపారు. కోర్టు తీర్పు రాగానే మోహన్ బాబు ముందస్తు బెయిల్ తీసుకొన్నారు. బాకీపడ్డా రూ. 40.50లక్షలు చెల్లించేందుకు 30రోజుల గడువు కోరారు.