ఐదేళ్లలో స్థానిక సమస్యలన్నీ పరిష్కరించుకొందాం : కేసీఆర్

రాబోయే ఐదేళ్లలో స్థానిక సమస్యలన్నీ పరిష్కరించుకొందాం అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మంగళవారం సాయంత్రం కేసీఆర్ భువనగిరి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి ఆరుగురు తెరాస ఎమ్మెల్యేలని మాత్రమే గెలిపించారు. ఈసారి 9మందిని గెలిపించారు. సంతోషం. ఇంకా ఐదేళ్ల సమయం ఉంది. ఈ ఐదేళ్లలో స్థానిక సమస్యలన్నీ పరిష్కరించుకొందాం అన్నారు సీఎం కేసీఆర్.

దేశంలో ఎక్కడా లేని విధంగా మనం రైతుబంధు, రైతు భీమా ఇస్తున్నం. కాలేశ్వరం నీళ్లు త్వరలోనే నల్గొండకు వస్తాయ్. బస్వాపురం రిజర్వాయర్ ని నింపుతాం. అన్నీ అవుతున్నాయ్. ఇక మిగిలింది రైతుకి గిట్టుబాటు ధర. దాన్ని సాధించుకొందాం అన్నారు. రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి ఏదోదో మాట్లాడుతున్నరు. 60యేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేదా.. ? ఎందుకు అభివృద్ధి చేయలేదు. వీళ్లకి మాటలే వస్తయ్. చేతులు రావు. ఆలోచించి ఓటెయండీ. తెరాసని గెలిపించండి. అభివృద్ధి చేసుకొందం అన్నారు సీఎం కేసీఆర్.