కేసీఆర్ పై వర్మ ఎటాక్


గతంలో ట్రెండ్ సెట్టర్ సినిమాలు తీశారు రామ్ గోపాల్ వర్మ. ‘శివ’తో ట్రెండ్ సెట్ చేశారు. ఆ తర్వాత హారర్, దెయ్యాలు, భూతాల సినిమాల విషయంలోనూ ట్రెండు సెట్ చేశారు. ఆ తర్వాత ఆ ఫార్మాలాతో బోర్ కొట్టించాడు. ఐతే, ఇప్పుడు వర్మ కొత్త ట్రెండుని ఫాలో అవుతుండు. అదే ‘కౌంటర్ బయోపిక్’. క్రిష్ తీసుకొచ్చిన ‘ఎన్టీఆర్ బయోపిక్’కి కౌంటర్ బయోపిక్ గా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని తీసుకొచ్చారు.

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ కి కౌంటర్ బయోపిక్ గా ‘శశికళ’ తీసుకొస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా వర్మ ఎటాక్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ అంతర్ముఖంపై వర్మ పరిశోధన షురూ చేశారు. కేసీఆర్ జీవన గమనంలో బైటికి తెలీని కోణాన్ని కథగా ఎంచుకొన్నాడు. వర్మ ఆస్థాన కవి సిరాశ్రీ కథనిరాసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. మరో యేడాదిన్నరలో కేసీఆర్ బయోపిక్ ని వర్మ తీసుకురాబోతున్నట్టు సమాచారమ్.