చరణ్’కి గాయాలు.. ‘RRR’ షూటింగ్ కి బ్రేక్ !
హీరో రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో గాయపడ్డారు. దాంతో పూణేలో జరుగుతున్న షెడ్యూల్ ఆగిపోయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ట్విట్ చేసింది. చరణ్ జిమ్ చేస్తున్న సమయంలో ఆయన కాలు బెనికింది. నడవలేని పరిస్థితి. ఆయనకి మూడు వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. దీంతో సినిమా షూటింగ్ కు కూడా అప్పటి వరకు బ్రేక్ ఇచ్చారు.
అల్లూరి సీతారామారాజు, కొమరం భీమ్ ల కథ ఇది. వీరిద్దరిలోని కామన్ పాయింట్ ఆధారంగా రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ కథని రాసుకొన్నారు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్. ఆయనకి జంటగా హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తున్నారు. అల్లూరి సీతా రామరాజుగా రామ్ చరణ్. ఆయనకి జంటగా బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ నటిస్తున్నారు.
బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, కోలీవుడ్ నటుడు, దర్శకుడు సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్ హీరోలు సంజయ్ దత్, వరుణ్ ధావన్ RRRలో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రూ. 400కోట్ల బడ్జెట్’తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 2020 జులై 30 RRR ప్రేక్షకుల ముందుకు రానుంది.
We regret to mention that #RamCharan confronted a minor ankle injury while working out at the gym, yesterday. The pune schedule has been called off. Back to action in 3 weeks! #RRR
— RRR Movie (@RRRMovie) April 3, 2019