‘మజిలీ’ టికెట్లు హాట్ కేకులు.. !


సమంత-నాగ చైతన్యల రొమాన్స్ ని చూసేందుకు ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పెళ్లైన తర్వాత చై-సామ్ తొలిసారి తెరపై రొమాన్స్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘మజిలీ’ కోసం జంటగా నటించారు. ఈ చిత్రం ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుక్కింగ్స్ స్టార్ అయ్యాయి. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

ఓ వైపు ఎన్నికల హడవుడి, మరోవైపు ఐపీఎల్ హంగామా నడుస్తున్నా.. ‘మజిలీ’ సినిమాని చూసేందుకు ప్రేక్షకులు ఉత్సాహం చూపిస్తున్నారు. సామ్-చైలది హిట్ పెయిర్. ఏం మాయ చేశావె చిత్రంతో తొలిసారి ప్రేక్షకులని మాయ చేశారు. ఐతే, ఇప్పుడు పెళ్లైన తర్వాత మరోసారి ప్రేక్షకులని మాయ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు.