సీఎం రమేష్ ఇంట్లో పోలీసుల తనిఖీలు


ఎన్నికల వేళ గత కొన్ని రోజులగా ఏపీ టీడీపీ నేతలపై ఐటీ, పోలీసుల దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ తెల్లవారుజామున క‌డ‌ప జిల్లా పోట్ల‌దుర్తిలోని సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దాదాపు 50 మంది ఈ తనిఖీల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. బెడ్ రూమ్, బాత్ రూమ్.. వేటిని వదలకుండా పోలీసులు తనిఖీలు చేసినట్టు తెలుస్తోంది.

టీడీపీలో సీఎం రమేష్ కీలక. ఎన్నికల ఆయన కడప జిల్లాలోని టీడీపీ అభ్యర్థులకు ఆర్థిక సాయపడుతున్నారనే ఆరోపణలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసినట్టు సమాచారమ్. ఐతే, తనిఖీలు చేసేందుకు సెర్చ్ వారెంట్ ఉందా ? అని పోలీసులని సీఎం రమేష్ ప్రశ్నించారు. ఎన్నికల వేళ సెర్చ్ వారెంట్ అవసరం లేదు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపినట్టు తెలుస్తోంది.

మరోవైపు, ఈ తనిఖీల వెనక మోడీ ఉన్నారు. వైకాపా హస్తం ఉంది. ఆ పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులతోనే టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని సీఎం రమేష్ ఆరోపించారు. ఎన్నికల పోలీసులు, ఐటీ దాడులు వన్ సైడ్ గా జరగతుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రమేష్ ఇంట్లో చేసిన తనిఖీల్లో డబ్బు ఏమాత్రం పట్టుబడలేదని తెలుస్తోంది.