థమన్’కు మణిరత్నం ప్రశంస
సంగీత దర్శకుడు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషలిస్ట్ గా మారిపోయాడు. ‘లైవ్ లేనిదే లైఫ్’ అంటూ.. తన బృందంతో కలిసి సినిమాలకి అద్భుతమైన నేపథ్యాన్ని సంగీతాన్ని అందిస్తున్నారు. తొలిప్రేమ, అరవింద సమేత సినిమాల కోసం థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ప్రశంసలు దక్కాయి. సినిమా రేంజ్ ని పెంచే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించాడని మెచ్చుకొన్నారు.
ఇప్పుడు ‘మజిలీ’ విషయంలోనూ థమన్ మేజిక్ పనిచేసింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మాయ చేశారు. అది సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఎమోషనల్ సీన్స్ లో థమన్ అందించిన నేపథ్య సంగీతం చాలా బాగుందని చెప్పుకొంటున్నారు. థమన్ ఇంకో గొప్ప ప్రశంస దక్కింది. మణిరత్నం సినిమాల రేంజ్ లో మజిలీ కోసం థమన్ బ్యాక్ గ్రౌండ్ అందించాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మణిరత్నం సినిమాలో నేపథ్య సంగీతం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కథలో ప్రేక్షకుడు లీనం అయ్యేలా నేపథ్య సంగీతాన్ని ట్యూన్ చేయిస్తుంటాడు మణిశర్మ. ఇప్పుడు మజిలీ కోసం థమన్ కూడా ఆ రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. థమన్ లో మంచి టాలెంట్ ఉంది. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్పెషలిస్టు. భవిష్యత్ లో ఆయన పెద్ద పెద్ద ప్రాజెక్టులకి పని చేసే ఛాన్స్ కచ్చితంగా వస్తుందని చెప్పుకొంటున్నారు. కంగ్రాంట్స్ & ఆల్ ది బెస్ట్ థమన్ గారు.