వైకాపా మేనిఫెస్టో విడుదల
ఉగాది రోజున ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి రెండు ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపాలు ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించాయి.
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోను.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అమరావతిలోని ఆ పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. నవరత్నాలతో పాటుగా పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలని జగన్ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఈ మేనిఫెస్టోలోని అన్నీ అంశాలని నెరవేరుస్తాం. దీన్ని చూపించి 2024లో మళ్లీ ఓట్లు అడుగుతానని జగన్ అన్నారు.
* రైతుకు పెట్టుబడి కింద రూ.50 వేలు
* పంటవేసే సమయానికి పెట్టుబడి కోసం మే నెలలో రూ.12,500
* పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతన్నలకు వడ్డీ లేని పంటరుణాలు, ఉచిత విద్యుత్, బోర్లు వేయిస్తాం.
* ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీలు రూ.1.5లకే(యూనిట్) ఇస్తాం. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల కరెంటు
* రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
* పంటవేసే ముందే ధరలు ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరలకు భరోసా
* రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి.
* ప్రతి నియోజకవర్గంలో గోదాంలు, శీతలీకరణ గిడ్డంగులు, ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటు
* మొదటి ఏడాది సహకార సంఘాన్ని పునరుద్ధరిస్తాం. రెండో ఏడాది నుంచి సహకార డెయిరీకి పాలుపోసే రైతుకు లీటరుకు రూ.4 బోనస్
* వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు. టోల్ ట్యాక్స్ రద్దు
* వైఎస్‌ఆర్ బీమా ద్వారా రైతులకు రూ.7 లక్షల బీమా. ఆ డబ్బు అప్పుల వాళ్లకు చెందకుండా చట్టం
* కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు. అన్ని ప్రయోజనాలు వారికి అందే వెసులుబాటు. నవరత్నాల్లోని అన్ని ప్రయోజనాలు వర్తింపు.
* రూ.5 లక్షలు ఆదాయం దాటని అన్ని వర్గాల వారికి వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ వర్తింపు
* వైద్య ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ కింద వైద్యం
* ఎన్ని లక్షలు ఖర్చయినా పూర్తిగా ఆరోగ్యశ్రీ.. ఏ నగరంలో చేయించుకున్నా వర్తింపు
* చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలో కుటుంబానికి చేయూత
* దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.10 వేల పింఛను
* రెండేళ్లలో కార్పొరేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల సంఖ్య పెంపు
* అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా పిల్లలను బడికి పంపితే రూ.15 వేలు
* 45 ఏళ్ల వయసు గల ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు మొదటి ఏడాది తర్వాత ఆయా కార్పొరేషన్ల ద్వారా రూ.75 వేల ఆర్థిక సాయం
* పింఛను రూ.3 వేలకు పెంపు. వికలాంగులకు రూ.3 వేలు పింఛను.
* పేదవారికి చదువుకయ్యే ఖర్చు పూర్తిగా ప్రభుత్వానిదే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు వసతి, భోజనం ఖర్చులు కూడా ప్రభుత్వ బాధ్యత
* ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ద్వారా అదే గ్రామానికి చెందిన చదువుకున్న యువతకు పది ఉద్యోగాలు
* ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా అసెంబ్లీ మొదటి సమావేశంలోనే బిల్లు
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు 50 శాతం రిజర్వేషన్లు
* సున్నా వడ్డీకే రుణాల పథకాన్ని మళ్లీ తెస్తాం. పొదుపు సంఘాల వడ్డీ డబ్బు బ్యాంకులకు ప్రభుత్వమే కడుతుంది.
* మద్యాన్ని నిషేధిస్తాం. మద్యాన్ని 5 నక్షత్రాల హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తాం.
* అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయింపు. 13 లక్షల బాధితులకు మేలు చేస్తాం. మిగిలిన వారికి తక్షణం పరిష్కారం దిశగా అడుగులు వేస్తాం.
* తిరుమలలో యాదవులు గుడి తలుపులు తెరిచే సంప్రదాయం పునరుద్ధరణ
* చనిపోయిన ప్రతి గొర్రెకు రూ.6 వేల బీమా
* సొంత ట్యాక్సీ నడిపేవారికి ఏడాదికి రూ.10 వేలు
* 18 ఏళ్లు నిండి 60 ఏళ్లలోపు వయసు ఉన్న ఏ పౌరుడికైనా వైఎస్‌ఆర్ జీవన బీమా పథకం కింద సహజ మరణమైనా లక్ష రూపాయలు అందజేత
* మాదిగ, రెల్లి, మాలలకు కార్పొరేషన్ ఏర్పాటు
* ఎస్సీ, ఎస్టీల యువతుల పెళ్లికి రూ.లక్ష
* గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు. అందులో విశ్వవిద్యాలయం, ఆస్పత్రి, కళాశాల ఏర్పాటు. ప్రతి ఐటీడీఏ పరిధిలో సూపర్
స్పెషాలిటీ ఆస్పత్రి
* ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం వారు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షలు
* ప్రభుత్వ పాఠశాలలో చదువుల ప్రమాణాలు మార్చుతాం. ఆంగ్ల మాద్యమంలో విద్యా బోధన. మాతృభాషకు సముచిత స్థానం
* ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజు తగ్గింపు. ప్రైవేటు ఉపాధ్యాయుల స్థితిగతుల మెరుగుకు రెగ్యులేటరీ కమిటీ
* జర్నలిస్టులకు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు
* బీసీల అభ్యున్నతికి ఏటా రూ.15 వేల కోట్ల ఖర్చు
* అన్ని నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు. వారి ఆర్థిక ఎదుగుదలకు అన్ని కాంట్రాక్టుల్లో 50
* బీసీలోని ఉపకులాల్లో వారికి కార్పొరేషన్లు ఏర్పాటు
* బీసీ యువతులకు పెళ్లి కానుక రూ.55 వేలకు పెంపు
* బీసీ కులాల వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు
* వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకూ రూ.10 వేలకు ఆర్థిక సాయం పెంపు
* పడవలకు కొత్తగా అనుమతులు మంజూరు. ప్రమాదవశాత్తు చనిపోయిన కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా
* ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.20 వేల ప్రోత్సాహకం
* కులవృత్తులు, చిరువ్యాపారులకు గుర్తింపు కార్డులు. వీరికి రూ.10 వేల వరకు సున్నా వడ్డీకే రుణాలు
* బీసీ హక్కులకు భంగం, నష్టం కలగకుండా ఉండే రిజర్వేషన్లకే వైకాపా మద్దతు
* కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.2 వేల చొప్పున పదేళ్లలో రూ.10 వేల కోట్ల కేటాయింపు
* అర్చకులకు పదవీ విరమణ రద్దు. అర్చకులకు వేతనాల కోసం పంచాయతీ జనాభాను బట్టి రూ.10 నుంచి రూ.35 వేల వరకూ. ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణం
* ముస్లిం, మైనారిటీ యువతులకు పెళ్లికి రూ.లక్ష
* హజ్ యాత్రకు వెళ్లే వారికి ఆర్థిక సాయం. ఇమామ్, మౌజమ్‌లకు వేతనంగా రూ.15వేలు. ప్రమాదవశాత్తు ముస్లిం, మైనారిటీ మరణిస్తే రూ.5 లక్షలు
* క్రిస్టియన్ల యువతి వివాహానికి రూ.లక్ష ఆర్థిక సాయం. పాస్టర్లకు వివాహ రిజిస్ర్టేషన్ సులభతరం. వారికి రూ.5వేలు గౌరవవేతనం
* ప్రమాదవశాత్తు క్రిస్టియన్లు మరణిస్తే రూ.5 లక్షలు
* అన్ని అగ్ర కులాల వారికి కార్పొరేషన్ల ఏర్పాటు
* ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లా చేస్తాం. పరిపాలన ప్రజల వద్దకే తీసుకెళ్తాం. రాజధానిని ఫ్రీజోన్‌గా మారుస్తూ అందరికీ ఉద్యోగాలు వచ్చే ప్రాంతంగా గుర్తిస్తూ వికేంద్రీకరణ లక్ష్యంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం.
* గ్రామ సచివాలయాలు, పట్టణాల్లో వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి సమగ్రాభివృద్ధికి ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా ఏర్పాటు
* ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు. పాత పింఛను విధానం అమలు. ఉద్యోగులు కోరుకున్న విధంగా 27 శాతం ఐఆర్. సకాలంలో
పీఆర్సీ అమలు
* పోలీస్‌లకు వారాంతపు సెలవు అమలు
* అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, హోంగార్డులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న జీతాల కన్నా రూ.వెయ్యి ఎక్కువగా ఇస్తాం.