15 ఓవర్లకు ముంబయి : 75/5


సన్‌రైజర్స్‌ బౌలర్లు అదరగొడుతున్నారు. 15 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 67 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కీరన్‌ పోలార్డ్‌(7), హార్దిక్‌ పాండ్య(7) బ్యాటింగ్‌ చేస్తున్నారు. ముంబయి కీలక వికెట్లు చేజార్చుకోవడంతో వేగంగా పరుగులు చేయడం లేదు. ఒత్తిడిలో ఉంది. హైదరాబాద్‌ బౌలర్లు అద్భుతంగా చేస్తున్నారు.

పోలార్డ్‌, హార్దిక్‌ పాండ్య ఇద్దరు మంచి హిట్టర్స్. వీరిద్దరు టచ్ లోకి వస్తే.. ఆఖరి ఓవర్లలో ముంబై మంచి స్కోర్ చేయొచ్చు. ఈ జంటని విడగొడితే మాత్రం సన్ రైజర్స్ కష్టానికి ఫలితం దక్కినట్టే. ఐతే, పిచ్ బౌలర్లకి అనుకూలిస్తోంది. దీంతో స్కోర్ చేయడం కష్టంగా మారుతోంది.