మహర్షి టీజర్ హవా మాములుగా లేదుగా.. !

‘మహర్షి’ హవా నెల ముందే మొదలైంది. ఉగాది కానుకగా శనివారం ఉదయం విడుదలైన మహర్షి టీజర్ యూట్యూబ్ లో హవా చూపిస్తొంది. రికార్డ్ వ్యూస్ ని సొంతం చేసుకొంటోంది. టీజర్ విడుదలైన 12గంటల లోపే 9మిలియన్స్ రియల్ టైమ్ వ్యూస్ ని ని సొంతం చేసుకొంది. దీంతో రిషి జర్నీ రికార్డ్స్ తో మొదలైందని మహేష్ అభిమానులు మురిసిపోతున్నారు.

ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమా విడుదలకి ఇంకో నెల సమయం ఉంది. ఐతే, అప్పుడే మహర్షి హవా మొదలైంది. రిలీజ్ కి నెల ముందే హవా చూపిస్తున్న మహర్షి ఏ రేంజ్ హిట్ కొడతాడన్నది చూడాలి.