‘మహర్షి’.. వంశీ మూడేళ్ల కష్టం !
మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న 25వ చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయిక. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉగాది సందర్భంగా శనివారం ఉదయం విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. టీజర్ యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతోంది. సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. టీజర్ విడుదలైన 12గంటల్లోనే 10మిలియన్ రియల్ టైం వ్యూస్ సొంతం చేసుకొంది. ఈ నేపథ్యంలో దిల్‌రాజు, వంశీ పైడిపల్లి మీడియాతో మాట్లాడారు. సినిమా విశేషాలు పంచుకున్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. “టీజర్ ట్రెండ్ సెట్ చేస్తోంది. మే 9న సినిమా విడుదల కాబోతోంది. వంశీ మొత్తం 5 సినిమాలు తీశారు. అందులో నాతో చేసిన సినిమాలు నాలుగు. స్క్రిప్ట్ నుంచి చూస్తే వంశీ ‘మహర్షి’ కోసం గత మూడేళ్లుగా కష్టపడుతున్నారు” అన్నారు
వంశీ మాట్లాడుతూ.. “‘రిషి’ పాత్రకు మహేష్ ఊపిరి పోశారు. ఆయన నమ్మకం, ఆదరణ కారణంగానే ఇంత మంచి సినిమా చేయగలిగాం. ‘ఊపిరి’ సినిమా సమయంలో మహేశ్‌కు ఈ సినిమా లైన్ చెప్పాను. తర్వాత 6 నెలలకు కథ చెప్పాను. ఈ కథ చెప్పే సమయంలో ఆయనకు ఇది తన 25వ సినిమా అని తెలియదు. అలా కుదిరింది. ‘మహర్షి’ సినిమా మహేశ్, మా అందరి కెరీర్లో మైలురాయిగా నిలిచిపోతుంది” అన్నారు
Rishi takes charge of Youtube records…
Fastest Teaser to cross 10 Milllion Real Time Views 🔥🔥#JoinRishi… https://t.co/y0HGn7FQFb#MaharshiTeaser #Maharshi #SSMB25 @urstrulyMahesh @directorvamshi @hegdepooja @allarinaresh @ThisIsDSP @kumohanan1 pic.twitter.com/dqbAJIVJE1
— Sri Venkateswara Creations (@SVC_official) April 6, 2019