హ్యాపీ బర్త్ డే స్టయిలీష్ స్టార్

మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టం. అంటే సరిపోదు. ఆయనలా కష్టపడాలి. ఆయనలా అభిమానులని అలరించాలి. ఆయన రేంజ్ కి ఎదగాలి. ఆ కసి ఉన్న మెగా హీరో అల్లు అర్జున్. ఇప్పటికే టాలీవుడ్ టాప్ హీరోల్లో ఆయన ఒకరు. అయినా.. ఇప్పటికీ చేసిన ప్రతి సినిమా తొలి సినిమాలా కష్టపడుతుంటాడు. ఇండస్ట్రీలో బన్నీలా కష్టపడే హీరో మరొకరు లేరు. ముఖ్యంగా డ్యాన్సుల్లో ఫర్ ఫెక్షన్ కోసం ఆయన పడే తపన అంతా ఇంతా కాదని చెబుతుంటారు. ఒకటికి వెయ్యి సార్లు ప్రాక్టీస్ చేస్తారు. బన్నీకి సినిమా అంటే అంత ప్రాణం.

‘గంగోత్రి’ సినిమాతో హీరోగా పరిచయమైన బన్నీ.. ‘ఆర్య’తో తనలోని అసలైన టాలెంట్ ని ప్రేక్షకులకి చూపించాడు. తన స్టయిలీష్ నటనతో ప్రేక్షకులని ఫిదా చేశాడు. మాస్ కు సరైనోడు. దేశముదురు, రేసుగుర్రం, సరైనోడు చిత్రాలతో పవర్ ఫుల్ పాత్రల్లో నటించారు. రుద్రమదేవిలో గోన గన్నారెడ్డిగా అదరగొట్టాడు. తెలంగాణ యాసలో బన్నీ చెప్పే డైలాగ్స్ కి థియేటర్స్ దద్దరిల్లి పోయాయ్. ‘వేదం’ సినిమాలో తన నటనతో కన్నీళ్లు పెట్టించాడు. మొత్తంగా.. స్టయిలీష్ స్టార్ ఆల్ రౌండర్.

ఈ ఆల్ రౌండర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ #tsmirchi. బన్నీ 19వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆ తర్వాత బన్నీ 20వ
సుకుమార్ దర్శకత్వంలో ఉండనుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మించనుంది. ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేయాల్సి ఉంది. అది క్యాన్సిల్ కావడంతో.. అల్లు అర్జున్ తో సుకుమార్ సినిమా ఓకే అయ్యింది.