కేంద్రంలోనూ వైకాపా హవా

ఏపీలో ఈసారి కచ్చితంగా వైకాపా అధికారంలోకి వస్తుంది. జగన్ సీఎం అవుతాడని సర్వేలు చెబుతున్నాయి. ఏపీలో వైకాపా అధికారంలోకి రావడమే కాదు.. ఆ పార్టీ కేంద్రంలోనూ కీలకంగా మారబోతుందని తాజా ఎన్డీటీవీ సర్వే చెబుతోంది. ఏపీలోని మొత్తం 25 లోకసభ స్థానాల్లో వైకాపా 20 స్థానాల్లో విజయం సాధిస్తుంది. తద్వారా ప్రాంతీయ పార్టీల్లో మూడో అతి పెద్ద పార్టీగా నిలుస్తుందని ఎన్డీటీవీ అంచనా వేసింది.

ప.బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ 30, తమిళనాడులో డీఎంకే 25 ఎంపీ సీట్లలో విజయం సాధించి మొదటి, రెండో స్థానాలను ఆక్రమిస్తాయని చెప్పింది. ఆ తర్వాత స్థానంలో వైకాపా ఉండనుంది. ఒడిశాలో బిజూ జనతాదళ్‌ 16 సీట్లు, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ 15 సీట్లు సాధించే అవకాశాలున్నాయి. మొత్తంగా.. 106 ఎంపీ సీట్లతో ప్రాంతీయ పార్టీల మద్దతు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఎన్డీటీవీ అంచనా వేసింది. గత ఎన్నికల ముందు ఏపీలో జగన్ దే అధికారం అని సర్వేలు చెప్పాయి. కానీ, అది జరగలేదు. ఈ ఎన్నికల్లోనూ సర్వేలు అదే చెబుతున్నాయి. మరీ.. ఈసారి ఫలితం ఎలా ఉండబోతుందనేది చూడాలి.