పోస్టల్‌ లో ఓట్లని కొనేస్తున్నారు

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ ఓటు హక్కుని పోస్టల్ ద్వారా వినియోగించుకొంటారన్న విషయం తెలిసిందే. ఐతే, వీరి ఓట్లని కొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక్కో పోస్టల్ ఓటు రూ. 4వేలు పెట్టి కొనేస్తున్నట్టు సమాచారమ్.

చిత్తూరు జిల్లావ్యాప్తంగా సుమారు 37వేల మంది ఉద్యోగులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. పార్టీకి అనుకూలంగా ఉన్న కొందరు ఉద్యోగ సంఘాల నేతల మధ్యవర్తిత్వంలో పోస్టల్ ఓట్లని కొనుగోలు చేసే ప్రక్రియ జరుగుతున్నట్టు తెలుస్తోంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఒక పార్టీ రూ.నాలుగు వేలు చెల్లిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.