నీ నీలి కన్నుల్లోని ఆకాశమే.. తెల్లారి అల్లేసింది నన్నే
కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీస్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ కార్యక్రమాలని మొదలెట్టింది.
సినిమాలోని తొలిసాంగ్ ని విడుదల చేశారు. ‘నీ నీలి కన్నుల్లోని ఆకాశమే.. తెల్లారి అల్లేసింది నన్నే’.. అంటూ సాగిన ఈ మెలోడి సాంగ్ అద్భుతంగా ఉంది. రెహ్మాన్ రాసిన ఈ పాటని గౌతమ్ భరద్వాజ్ ఆలపించారు. జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందించారు. ప్రేమలోని గమ్మత్తుని తెలుపుతూ.. సాగే ఈ సాంగ్ వినడానికి సొంపుగా ఉంది. ఈ పాటని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేశారు.