అలీపై పవన్ పంచులు
స్నేహమంటే ఇదేనా అలీ ? అంటూ ప్రశ్నించారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలీ పవన్ కు మంచి స్నేహితుడు. ఈ నేపథ్యంలో అలీ జనసేన పార్టీలో చేరుతారని అందరు భావించారు. కానీ, అలీ వైకాపాలో చేరారు. అందేంటీ ? అంటే.. స్నేహం వేరు. రాజకీయాలు వేరన్నారు. ఇప్పుడు పవన్ కూడా అలీని స్నేహితుడిగా కాకుండా.. రాజకీయ ప్రత్యర్థిగా చూశారు. అలీపై పంచులేశారు. సోమవారం పవన్ రాజమండ్రిలో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా.. అలీ వైసీపీలో చేరిన విషయమై పవన్ స్పందించారు. ఎంపీ టిక్కెట్టు ఇస్తానంటే అలీ వైసీపీలో చేరాడు. కానీ, వైసీపీ నేతలు అలీని వాడుకొంటున్నారని పవన్ విమర్శించారు. అలీ కష్టాల్లో ఉన్న సమయంలో తాను ఆదుకొన్నన్నా. స్నేహమంటే ఇదేనా ? అంటూ అలీని ప్రశ్నించారు. తండ్రి శవం దొరకకముందే సీఎం పదవి కోసం జగన్ తాపత్రయపడ్డాడని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అలాంటి జగన్ రాష్ట్రానికి అవసరమా ? అని ప్రశ్నించారు పవన్. కన్నబాబు లాంటి చెంచాలు అవసరం లేదన్నారు.