పవన్’తో కలిసి ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి పాలకొల్లులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గత కొన్నాళ్లుగా పవన్ ఆరోగ్యం బాగోలేదు. ఆయన డీ హైడ్రేషన్ తో బాధపడుతున్నారు. డాక్టర్లు విశ్రాంత్రి తీసుకోవాలని సూచించినా.. వినకుండా పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం పవన్ చూడడానికి బన్నీ పాలకొల్లు వచ్చారు. ఆయనతో కలిసి పాలకొల్లులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అంతకుముందు పాలకొల్లు చేరుకొన్న బన్నీకి ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత నేరుగా వెళ్లి పవన్ ని పరామర్శించిన బన్నీ.. ఆయనతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బన్నీ, పవన్ ని చూడ్డానికి ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. ఇక, రెండ్రోజుల ముందు రామ్ చరణ్ బాబాయ్ ని చూడ్డానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు పవన్, బన్నీ అభిమానుల మధ్య మనస్పర్థలు ఉండేవి. ఇప్పుడవి మొత్తం సమసిపోయినట్టే. ఇది ఎన్నికల ముందు జనసేనకు కలిసొచ్చే అంశమే.