రమేశ్‌ రాఠోడ్‌కు తీవ్ర గాయాలు

ఆదిలాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రమేశ్‌ రాఠోడ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ఎన్నికల ప్రచారం ముగించుకొని వస్తున్నఆయన కారు ప్రమాదానికి గురైంది. జైనూర్‌ నుంచి ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి కారులో వస్తున్న సమయంలో.. మావల సమీపంలో అకస్మాత్తుగా రహదారిపైకి వచ్చిన అడవి పందిని తప్పించే క్రమంలో కారు పక్కనున్న చెట్టును ఢీకొంది.

ఈ ప్రమాదంలో రమేశ్‌ రాఠోడ్‌ తల, పక్కటెముకలకు గాయాలయ్యాయి. డ్రైవర్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు రమేష్ రాథోడ్, ఆయన డ్రైవర్ ని రిమ్స్‌కి తరలించారు. రమేశ్‌ రాఠోడ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఐతే, ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.