అమిత్ షా’వి తప్పుడు లెక్కలు : కేటీఆర్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అబద్దాలని ఎండగట్టారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఐదేండ్లలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం రూ.2,45,00 కోట్లు ఇచ్చిందని షా ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీనిపై కేటీఆర్ స్పందించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది కేవలం రూ.1,10,963 కోట్లేనని కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్ మెట్రో రైలుకు కేంద్రం రూ.16వేల కోట్లు ఇచ్చిందని అమిత్ షా చేసిన మరో ట్విట్ కి కేటీఆర్ స్పందించారు. మెట్రో ప్రాజెక్టుకు కేంద్రంం ఇచ్చింది రూ.1200 కోట్లు మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం మరో రూ.3000 కోట్లు ఖర్చు చేసిందని కేటీఆర్ తెలిపారు. మిగిలిన మొత్తాన్ని పీపీపీ పద్ధతిలో పనులు చేపట్టిన నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ భరిస్తున్నదని వివరించారు.
Yet another blatant and ridiculous lie. The total amount contributed by Govt of India for Hyderabad metro project is ₹1200 Cr. State Govt spent ₹3,000 Cr and remaining by the agency LnT who took up the work in PPP mode
Please get the script checked before you speak next time https://t.co/kAC3ca6kfq
— KTR (@KTRTRS) April 9, 2019