సంపూకి.. సన్నీలియోన్ ఎవరో తెలీయడట !


‘కరెంట్ తీగ’లో సన్నీలియోన్ బోయ్ ఫ్రెండ్‌గా నటించారు సంపూర్ణేశ్ బాబు. ‘అలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరైన అలీ సన్నీతో తన అనుభందాన్ని పంచుకొన్నారు. “కరెంట్ తీగ సినిమాలో వేషం ఉందని మోహన్ బాబు నన్ను పలిచారు. వెంటనే మోహన్ బాబు వద్దకు వెళ్లా. ఏమయ్యా సన్నీలియోన్ ఎవరో నీకు తెలుసా అని ఆయన అడిగారు. నాకు తెలియదు అన్నాను. ఈ సినిమాలో ఆమె నీ లవర్‌గా చేస్తున్నారని చెప్పారు. షూటింగ్ కు కేవలం ఒక్క రోజు మాత్రమే కావటంతో ఆమెతో పెద్దగా మాట్లాడలేదు. షూటింగ్ అయిన తర్వాతే సన్నీలియోన్ ఎవరో నాకు తెలిసింది” అన్నారు.

కరెంట్ తీగ సినిమా విడుదలైన తర్వాత ఎక్కడి వెళ్లినా సన్నీతో ఛాన్స్ కొట్టేశావ్’గా అంటూ సంపూని ఆటపట్టించేవారుట. ప్రస్తుతం సంపూ ‘కొబ్బరిమట్ట’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సంపూ మూడు పాత్రల్లో నటిస్తున్నారు. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడు పాత్రల్లో సంపూ కనిపిస్తారట. ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే సినిమా విడుదల కానుంది. కొమ్మరిమట్ట ప్రేక్షకులని కచ్చితంగా నవ్విస్తుందన్నారు సంపూ.