కీర్తి మెగా సూపర్ ఛాన్స్


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా ఉండనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన కొరటాల.. నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ కోసం హీరోయిన్ గా శృతిహాసన్ అని అనుకొన్నా. ఆ తర్వాత ఆమె చిరుకి ఫర్ ఫెక్ట్ జోడికాదని భావించి పక్కకుపెట్టారు.

ఫైనల్ గా మెగాస్టార్ కోసం మహానటి కీర్తి సురేష్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారమ్. ప్రస్తుతం కీర్తి సురేష్ రజనీకాంత్ ‘దర్భార్’లో నటిస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ మురగదాస్ దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ బుధవారం ముంబైలో ప్రారంభం అయ్యింది. ఇందులో నయన్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఒకే టైంలో కీర్తి సూపర్ స్టార్ మెగాస్టార్ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. ఐతే, చిరు-కొరటాల సినిమా కోసం కీర్తి తీసుకొన్న దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.