అక్షయ్ 11మందిని ఉంచుకొన్నాడట
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఏకంగా 11మందిని వాడుకొంటున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా బయటపెట్టింది. భర్తతో వాగ్వాదానికి దిగింది. ఇటీవల ట్వింకిల్ ఖన్నా ‘మోస్ట్ స్టైలిష్ ఆథర్ అవార్డ్’ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డు ఫంక్షన్ కి భర్త అక్షయ్ తో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా వీరిద్దరితో చిన్న చిట్ ఛాట్ నిర్వహించారు నిర్వాహకులు.
ఈ సందర్భంగా భర్తపై ట్వింకిల్ చాలా ఆరోపణలే చేసింది. అక్షయ్ కు ఏకంగా 11 మంది సహాయకులు ఉన్నారు. తనకి ఒక్కరు కూడా లేరు. అందుకే ఆయన కంటే తాను లేటుగా రెడీ అవుతానని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. అక్షయ్ దుస్తుల కోసం సపరేటుగా ఓ రూమ్ నే ఉందట. దాని నిండా బట్టలు ఉన్నాయట. ఇక అక్షయ్ కూడా భర్తపై ఒకట్రెండు ఆరోపణలు చేశారు. తనపై ఆమె 100% కమాండింగ్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. మొత్తంగా.. ఈ జంట సరదాగా ఉంటుందన్న విషయం చిట్ చాట్ తో అర్థమైంది.