డబ్బుతో దొరికిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి బంధువు ?
చేవేళ్ల కాంగ్రెస్ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బంధువు సందీప్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. సందీప్ రూ.15కోట్లు పంచినట్టు ఆరోపణలున్నాయి. ఆయన్ని బుధవారం హైద్రాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టవర్స్‌లో పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఆయన నుంచి కీలక ఆధారాలు దొరినట్టు తెలుసోంది. ఎవరికి ఎంత డబ్బు ఇచ్చాను అన్న విషయాలని సందీప్ కోడ్ రూపంలో రాసుకొన్నాడట. ఆ కోడ్ ని ఢీకోడ్ చేసే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది.
మంగళవారం రాత్రి సందీప్ రెడ్డిని ఇంటిపై ఐటీ అధికారులు దాడులు జరిగినట్టు సమాచారమ్. ఆ సమయంలోనే ఆయన రూ. 15కోట్లు పంచినట్టు తెలిసినట్టుంది. వాటిని రెడ్ హ్యాండెండ్ గా పట్టుకొనేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. చివరకు డబ్బు పంపిణికి సంబంధించి ఆధారాలు మాత్రం దొరికినట్టుంది. ఎన్నికల ముందు సందీప్ రెడ్డి నోరు తెరచి నిజాలు చెబితే.. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఈసీ నుంచి తిప్పలు తప్పకపోవచ్చు.