బ్రేకింగ్ : త్రివిక్రమ్’తో మహేష్ సినిమా ఫిక్స్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులని సప్రైజ్ చేశాడు. మరోసారి దర్శకుడు త్రివిక్రమ్ తో జతకట్టబోతున్నట్టు ప్రకటించాడు. మహేష్-త్రివిక్రమ్ లది హిట్ కాంబో. వీరి కలయికలో అతడు, ఖలేజా సినిమాలొచ్చాయ్. వీటిలో అతడు సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ‘అతడు’ ఎప్పుడు టీవీల్లో ప్రసారమైన టీఆర్పీ రేటింగ్స్ అదిరిపోతుంటాయి. ఖలేజా మంచి సినిమా అనిపించుకొన్నా.. కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు వీరి కలయికలో హ్యాట్రిక్ సినిమా రాబోతుంది.

తాజాగా, త్రివిక్రమ్ సినిమాపై మహేష్ ట్విట్ చేశారు. “మరోసారి ఫెవరేట్ దర్శకుడితో. ఆయనతో పని చేయడం ఎప్పుడు ఆనందంగా ఉంటుందని” ట్విట్ చేశారు. ఐతే, అది సినిమానా ? లేక యాడ్ కోసమా ? అన్నది మహేష్ స్పష్టం చేయలేదు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ పలు యాడ్స్ కి కూడా నటించారు. ప్రస్తుతం మహేష్ మహర్షి సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తికావొస్తోంది. మే 9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

మరోవైపు, త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఈ నెల 24 నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఒకవేళ మహేష్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటే.. బన్నీ సినిమా తర్వాత ఉండనుంది. అలాకాకుండా యాస్ అయితే… ఈ గ్యాప్ లో ఉండనుంది. మరీ.. దీనిపై మహేశ్ మరింత క్లారిటీ ఇస్తే బాగుండేమో.. !