కేసీఆర్’కు ఈసీ నోటీసులు.. ఎందుకంటే ?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 17న కరీంనగర్ బహిరంగ సభలో హిందువులనుద్దేశించి కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని అభ్యంతరం వ్యక్తంచేస్తూ రామరాజు (విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు) ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ.. సీఎం కేసీఆర్‌కు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. దీనిపై కేసీఆర్ ఎలాంటి వివరణ ఇస్తారన్నది చూడాలి.
మరోవైపు, తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తిగా మారింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించింది. లోక్ సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీ 16స్థానాలని గెలవాలనే లక్ష్యాన్ని పెట్టుకొంది. మరీ.. ‘కారు సారు పదహారు’ ఫలిస్తుందా ? లేదంటే కారు జోరుకి లోక్ సభ ఎన్నికలు బ్రేకులు వేస్తాయా ?? అన్నది వేచి చూడాలి.