వైకాపా నేతల దాడిలో టీడీపీ నేత మృతి ?

ఏపీలో పలు చోట్ల పోలింగ్‌ హింసాత్మకంగా మారింది. తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. తాడిపత్రి మండలం మీరాపురంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో తెదేపా నేత చింతా భాస్కర్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. పోలింగ్‌ కేంద్రంలోనే ఈ దాడి జరిగింది. భాస్కర్ రెడ్ది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం సిద్ధ రామాపురంలో పోలింగ్‌ కేంద్రంలోనే తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య జరిగిన్ ఘర్షణలో పది మందికి గాయాలయ్యాయి. ఓవైపు, తెదేపా-వైకాపా నేతల మధ్య ఘర్ణణలు, మరోవైపు, ఈవీఎంల మొరాయింపుతో ఏపీలో పోలింగ్ అంత సజావుగా ఏమీ జరగడం లేదు.