తెలంగాణలో ముగిసిన పోలింగ్

తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 13 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో సాయంత్రం 4గంటలకే ముగిసింది. మిగితా చోట్ల సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరిగింది. ఒక్క నిజామాబాద్ లోక్ సభ స్థానానికి సంబంధించి సాయంత్రం 6గంటలకి పోలింగ్ జరగనుంది. అక్కడ 74మంది రైతులు పోటి చేయడంతో.. పోలింగ్ ఆలస్యం అవుతోంది. అందుకే గంట ఎక్కువ సమయం ఇచ్చారు.

మధ్యాహ్నం 3గంటల వరకు తెలంగాణలో 48శాతం పోలింగ్ జరిగింది. మొత్తంగా 60శాతం పోలింగ్ దాటవచ్చని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో పోలింగ్ శాతం చాతా తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం వరకు గ్రేటర్ హైదరాబాద్ లో 27శాతం మాత్రమే నమోదైంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో అత్యధికంగా 56శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంగా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. తాజా లోక్ సభ ఎన్నికల చాలా తక్కువ శాతం నమోదైంది.