ఓటు గల్లంతుపై తల్లీకూతుళ్ల ఆగ్రహం

తన ఓటు గల్లంతు కావడంపై అపోలో ఆస్పత్రుల వైస్‌ ఛైర్‌పర్సన్‌ శోభన కామినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది నా జీవితంలోనే వరస్ట్‌ రోజు. నేను భారత్‌కు వచ్చిందే నా బాధ్యతను నిర్వర్తించడం కోసం. తీరా పోలింగ్‌ బూత్‌కు రాగానే ఓటు గల్లంతైందని అంటున్నారు. నాకు ఈ దేశంలో విలువ లేదా? నా ఓటు ముఖ్యం కాదా? ఓ పౌరురాలిగా ఇది నాపై జరిగిన నేరంగా భావిస్తున్నాను. నేను దీనిని సహించలేను’ అని శోభన ట్విట్ చేశారు. వ్యాపార కార్యకలాపాల నిమిత్తం విదేశాలకు వెళ్లిన శోభన ఓటు వేయడానికి హైదరాబాద్‌ చేరుకున్నారు. కానీ జాబితాలో ఆమె ఓటు గల్లంతు కావడంపై నిరాశ చెందారు.

అమ్మ ఓటు గల్లంతు కావడంపై ఉపాసన ట్విటర్ వేదికగా స్పందించారు. ‘మా అమ్మ ఈరోజు తన ఓటు హక్కు వినియోగించుకో లేకపోయింది. పది రోజుల క్రితం చూసుకున్నప్పుడు ఓటర్ల జాబితాలో తన పేరుంది. కానీ ఇప్పుడు గల్లంతైంది. అమ్మ కూడా పన్ను కడుతోంది. అలాంటప్పుడు ఆమె లెక్కలోకి రాదా ? భారత పౌరురాలిగా ఆమెకు విలువ లేదా?’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు.