వంద విజయాల ధోని


కెప్టెన్ గా ధోని సరికొత్త రికార్డుని నెలకొల్పాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ధోని వంద విజయాలు సాధించాడు. గురువారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. ఓపెనర్లు రహానె (14; 11 బంతుల్లో 3×4), బట్లర్‌ (23; 10 బంతుల్లో 4×4, 1×6) శుభారంభమే ఇచ్చారు. ఆఖరి ఓవర్లలో శ్రేయస్‌ గోపాల్‌ (19 నాటౌట్‌; 7 బంతుల్లో) అదరగొట్టాడు. జడేజా 2, శార్దూల్‌ ఠాకూర్‌ 2, చాహర్‌ 2 వికెట్లు తీశారు.

152 పరుగుల ఛేదనలో చెన్నై ఆరంభంలోనే తడబడింది. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోయింది. కానీ, కెప్టెన్‌ ధోని (58; 43 బంతుల్లో 2×4, 3×6), రాయుడు (57; 47 బంతుల్లో 2×4, 3×6) మెరుపులతో ఆ జట్టు విజయానికి దగ్గరగా వచ్చింది. ఆఖరి ఓవర్లో 18 పరుగులు చేయాల్సి రాగా.. తొలి బంతికి జడేజా కళ్లుచెదిరే సిక్స్‌ కొట్టాడు. తర్వాత బంతి నోబాల్‌ అయింది. దీనికి జడేజా ఒక పరుగు తీశాడు. ఫ్రీహిట్‌ బంతికి రెండు పరుగులు చేసిన ధోని.. మూడో బంతికి బౌల్డ్‌ అవడంతో మ్యాచ్‌ మళ్లీ ఉత్కంఠభరితంగా మారింది. ఆఖరి బంతికి 4పరుగులు అవసరం కాగా శాంట్నర్‌ సిక్స్‌ బాది చెన్నైని గెలిపించాడు.