ట్విట్టర్ రివ్యూ : చిత్రలహరి – యావరేజ్


అపజయం ఎదురైనప్పుడే విజయం విలువ తెలుస్తుంది. వరుసగా ఆరు ప్లాపులు పడిన హీరో సాయిధరమ్ తేజుకు విజయం విలువ బాగా తెలుసు. ఆయన నటించిన తాజా చిత్రం ‘చిత్రలహరి’. కిషోర్ తిరుమల దర్శకుడు. కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ హీరోయిన్స్ . సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీస్ నిర్మించింది. ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ బాగుండటంతో.. ఈసారి తేజుకి హిట్ పక్కా అనే కామెంట్స్ వినిపించాయి. భారీ అంచనాల మధ్య చిత్రలహరి ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఇప్పటికే బెనిఫిట్ షోస్ పడిపోయాయి. సినిమా టాక్ ని కొందరు ట్విట్టర్ ద్వారా పంచుకొంటున్నారు. సినిమాకి మిక్సిడ్ టాక్ వినిపిస్తుంది. అందరు కూడా ఫస్టాప్ బాగుందని ట్విట్ చేస్తున్నారు. ఐతే, సెకంఢాప్ సినిమాని దెబ్బతీసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సెకాంఢాఫ్ లో స్లో నేరేషన్ ఇబ్బంది పెట్టింది. బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయని చెబుతున్నారు.

తేజు నటన సినిమాకే హైలైట్. ఆయన సెటిల్డ్ గా నటించారు. చాన్నాళ్ల తర్వాత సునీల్ కి మంచి పాత్ర దొరికింది. తేజు-సునీల్ ల మధ్య సన్నివేశాలు బాగున్నాయని చెబుతున్నారు. సెకంఢాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. దేవిశ్రీ అందించిన పాటలు, నేపథ్య సంగీతం రెండూ బాగున్నాయి. క్లైమాక్స్ ని ముందే ఊహించే విధంగా, రొటీన్ గా ఉంది. ఎమోషన్స్ అంతగా కనెక్ట్ కాలేదు.

మొత్తంగా.. ‘చిత్రలహరి’ సినిమాకు యావరేజ్ టాక్ వినిపిస్తోంది. సక్సెస్ కోసం తేజు వేట కొనసాగించాల్సిందే. మైత్రీ మూవీస్ కి వరుసగా హ్యాట్రిక్ ప్లాపులు పడినట్టేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి. చిత్రలహరి తేజుకి హిట్ ఇవ్వకపోయినా.. నటుడిగా మాత్రం ఆయన్ని ఓ మెట్టేక్కించే చిత్రంగా నిలుస్తుంది. తన ఎనర్జిని అంతా పక్కన పెట్టేసి తేజు సెటిల్డ్ ఫర్ ఫామెన్స్ బాగుందని చెబుతున్నారు.