‘జెర్సీ’ ట్రైలర్.. అదిరింది !

నేచురల్ స్టార్ నానికి నాన్ స్టాప్ గా హిట్స్ కొట్టడం అలవాటే. డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కూడా నాని ఖాతాలో ఉన్నాయి. ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా నాని విజయయాత్రకు బ్రేక్ వేసింది. నాగ్ తో కలిసి నాని నటించిన ‘దేవదాస్’ యావరేజ్ సినిమా అనిపించుకొంది. నాని నటిస్తున్న తాజా చిత్రం ‘జెర్సీ’. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. శ్రద్ధ శ్రీనాథ్‌ కథానాయిక. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. ఈ నెల 19న ‘జెర్సీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా, ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం

స్టోరీ లైన్ ని తెలియజేస్తూ.. మనసుకు హత్తుకొనేలా జెర్సీ ట్రైలర్ ని కట్ చేశారు. ట్రైలర్ లో నాని నట విశ్వరూపం కనిపిస్తోంది. అర్జున్ పాత్రలో నాని ఒదిగిపోయాడు. యువ క్రికెటర్ గా మంచి భవిష్యత్ ఉన్న అర్జున్.. గొడవలు, ప్రేమ కారణంగా కెరీర్ ని నాశనం చేసుకోవడం ట్రైలర్ లో చూడొచ్చు. ఆ తర్వాత ఏ పని చేయలేక.. ఆర్థిక ఇబ్బందులు. కొడుకు కోరికలు తీర్చేందుకు అర్జున్ పడే తపన. ఇంట్లో, బయట సూటిపోటి మాటలకి అర్జున్ పడే వ్యధ. చివరకి మళ్లీ బ్యాటు పట్టడం. ఐతే, వయసు రీత్యా ఎదురైనా ఇబ్బందులతో ట్రైలర్ ని అద్భుతంగా కట్ చేశారు. చివరల్లో తండ్రి బాధ్యతని గుర్తు చేస్తూ నాని చెప్పిన డైలాగ్ హైలైట్.