రివ్యూ : చిత్రలహరి
చిత్రం : చిత్రలహరి (2019)
నటీనటులు : సాయి తేజ్, కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్, సునీల్ తదితరులు
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
దర్శకత్వం : కిషోర్ తిరుమల
నిర్మాత : రవిశంకర్ యలమంచిలి, నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి
రిలీజ్ డేటు : 12 ఏప్రిల్, 2018.
రేటింగ్ : 3/5
అపజయం ఎదురైనప్పుడే విజయం విలువ తెలుస్తుంది. వరుసగా ఆరు ప్లాపులు పడిన హీరో సాయిధరమ్ తేజుకు విజయం విలువ బాగా తెలుసు. ఆ విజయం కోసం తేజు కసితో నటించిన ‘చిత్రలహరి’. కిషోర్ తిరుమల దర్శకుడు. కళ్యాణి ప్రియదర్శన్, నివేత పేతురాజ్ హీరోయిన్స్ . సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీస్ నిర్మించింది. ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ బాగుండటంతో.. ఈసారి తేజుకి హిట్ పక్కా అనే కామెంట్స్ వినిపించాయి. భారీ అంచనాల మధ్య చిత్రలహరి ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. చిత్రలహరి ఎలా ఉంది ? తేజుకి హిట్ దక్కినట్టేనా ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.
కథ :
జీవితంలో అసలు సక్సెస్ అంటే ఏంటో తెలియని కుర్రాడు విజయ్ కృష్ణ (సాయి ధరమ్ తేజ్). ఈ పోటీ ప్రపంచంలో తాను గెలవలేకపోతున్నాని నిరుత్సాహంలో మునిగిన యువకుడు. ఐతే, విజయ్ పై ఆయన తండ్రి (పోసాని కృష్ణమురళి) గట్టి నమ్మకం. తన కొడుకు ఎప్పటికైన సక్సెస్ అవుతాడనే ధీమా. ఇలాంటి యువకుడి జీవితంలో లహరి (కల్యాణీ ప్రియదర్శన్), చిత్ర (నివేదా పేతురాజ్)ల పాత్ర ఏంటి ? సక్సెస్ కోసం విజయ్ పడిన తపన, ఆటు పోటులు ఏమిటీ.. ? చివరికి విజయ్ విజయాన్ని అందుకొన్నాడా.. ?? అనేది చిత్రలహరి కథ.
ప్లస్ పాయింట్స్ :
* కథ-కథనం
* సాయి తేజు నటన
* సంభాషణలు
* సునీల్, వెన్నెల కిషోర్ ల నటన
* నేపథ్య సంగీతం
* ఫస్టాఫ్
మైనస్ పాయింట్స్ :
* అక్కడక్కడ స్లో నేరేషన్
ఎలా ఉందంటే ?
చిత్రలహరి టైటిల్ పాజిటివ్. కథ మాత్రం ఫెల్యూర్ స్టోరి. సక్సెస్ విషయంలో.. నేటి యూత్ ఆలోచన విధానాన్ని తెరపై చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు కిషోర్ తిరుమల. సక్సెస్ వెంట పరిగెడుతూ తమని తాము ఎలా కోల్పోతున్నారన్న పాయింట్ ని చాలా బాగా చూపించారు. సినిమా ఎలా ఉంది ? ప్రేక్షకులకి ఏ మేరకు కనెక్ట్ అయిందనే విషయం పక్కన పెడితే.. ప్రతి ఒక్కరు చూడాల్సి సినిమా. విజయం కోసం ఆరాటం మాత్రమే కాదు.. ఓపిక కూడా ఉండాలనే పాయింట్ ఆకట్టుకొంది. కథని నడిపే విషయంలో దర్శకుడి తడబాటు కూడా కనిపించింది. మంచి కథ. మంచి మాటలు కుదిరిరాయి. దాన్ని గ్రిప్పింగ్ గా చూపించలేకపోయాడు.
ఎవరెలా చేశారంటే ?
తేజు మెగా బ్రాండ్ హీరో. కావాల్సినంత ఎనర్జి ఆయన సొంతం. ఫైట్లు, డ్యాన్సుల్లో ఇరగదీసే రకం. ఐతే, అవన్నీ ‘చిత్రలహరి’లో లేవు. ఇందులో కొత్త తేజు కనిపిస్తాడు. తన ఎనర్జిని అంతా పక్కన పెట్టేసి.. సెటిల్డ్ ఫర్ ఫామెన్స్ తో అదరగొట్టాడు తేజు. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఇది తేజుకి పేరు తెచ్చే సినిమా. విజయం కోసం ఆరాటపడే ఓ సాధారణ యువకిడి పాత్రలో తేజు ఒదిగిపోయాడు.
హీరోయిన్ కల్యాణీ ప్రియదర్శన్ ఫర్వాలేదనిపించింది. ఆమె సొంతంగా డబ్బింగ్ చెప్పుకొంది. మరో హీరోయిన్ నివేదా పేతురాజ్‌కు కార్పోరేట్ ఉమెన్‌గా ఆకట్టుకొంది. ఉన్నంతలో బాగానే చేసింది. చానాళ్ల తర్వాత సునీల్ కి మంచి పాత్ర దక్కింది. తన మార్క్ కామెడీతో ఆకట్టుకొన్నాడు. వెన్నల కిషోర్ సెకాంఢాఫ్ లో నవ్వులు పంచాడు. హీరో తండ్రిగా పోసాని కృష్ణ మురళి నటన బాగుంది.
సాంకేతికంగా :
చిత్రలహరి పాటలు ఆల్రెడీ హిట్. సినిమాలో చూడ్దానికి బాగున్నాయి. దేవిశ్రీ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని మరింత పెంచింది. సినిమాటోగ్రఫీ బాగుంది. అక్కడక్కడ స్లో నేరేషన్ ఇబ్బంది పెట్టింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా :
‘చిత్రలహరి’ టాక్ తో సంబంధం లేకుండా అందరూ చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే సినిమా.
రేటింగ్ : 3/5