నలుగురు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు
కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నలుగురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షం టీఆర్ఎస్లో విలీనం చేస్తూ ఈ నలుగు ఎమ్మెల్సీలు సభాపతికి లేఖ కూడా ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. పార్టీ మారిన ఎమ్మెల్సీలు ప్రభాకరరావు, సంతోష్‌కుమార్, ఆకుల లలిత, దామోదర్ రెడ్డిలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ విషయమై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని శాసనమండలి ఛైర్మెన్, శాసనమండలి కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం సాధించిన సాధించిన సంగతి తెలిసిందే. ఏకంగా 88 స్థానాలని గెలుచుకొంది. ఆ తర్వాత కాంగ్రెస్, తెదేపా, స్వత్రంత్య్ర అభ్యర్థులతో కలిసి తెరాసలో 12మంది చేరారు. దీంతో తెరాస బలం వందకు చేరుకొంది. శాసన మండలిలోనూ వలస ద్వారా తెరాస బలం పెంచుకొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు తెరాసలో చేరారు. ఇప్పుడీ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం. శాసనమండలికి కోర్టు మెట్టికాయలు వేసేలా కనిపిస్తోంది.