గెలుపుకే కథలా మారావు


‘మహర్షి’ రెండో పాట వచ్చేసింది. ‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం’ అంటూ సాగే లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు. ఈ వీడియోలో మహేష్ బాబు బిజినెస్ మెన్ లా హెలికాఫ్టర్ నుండి దిగి స్టైల్ గా నడుచుకుంటూ రావడం హైలైట్ గా నిలిచింది. పాటలోని ‘నీదొక మార్గం అనితర సాధ్యం..’ ‘గెలుపుకే కథలా మారావు..’ పదాలు ఆకట్టుకొంటున్నాయి. శ్రీమణి రచించిన ఈ పాటను యాజిన్ నిజార్ ఆలపించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ కి స్నేహితుడిగా అల్లరి నరేష్ కనిపించనున్నారు. ఇందులో మహేష్ మూడు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. కాలేజీ స్టూడెంట్, బిజినెస్ మేన్, రైతుగా కనిపిస్తారు. రైతుగా మహేష్ లుక్ ఇంకా రివీల్ కాలేదు. ఆ లుక్ ని సినిమా విడుదల వరకు సస్పెన్స్ లో ఉంచబోతున్నట్టు తెలిసింది. దిల్ రాజు, అశ్వనీదత్, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.