తల్లిని ఇంటి నుంచి గెంటేసిన హీరోయిన్

హీరోయిన్ సంగీతపై ఆమె తల్లి భానుమతి పోలీసులకి ఫిర్యాదు చేసింది. కూతరి తనని ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి తెస్తున్నట్టు ఫిర్యాదు లో పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు వలసరవాక్కంలో భానుమతి నివాసం ఉంటున్నారు. ఇంట్లో పైభాగంలో సంగీత తన భర్తతో కలిసి ఉంటోంది. కింద భాగంలో ఆమె తల్లి భానుమతి ఉంటోంది. ఇల్లు మాత్రం సంగీత పేరు మీదనే ఉంది. దీంతో ఇల్లు వదిలి వెళ్లిపోవాలని సంగీత తల్లిపై ఒత్తిడి తెస్తుందట. ఈ మేరకు భానుమతి తమిళనాడు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ సంగీతకు నోటీసులు జారీ చేసింది.

మరోవైపు, సంగీత వర్షన్ మరోలా ఉంది. తనని చిన్నప్పటి నుంచి తల్లి వాడుకొంది. డబ్బు కోసం చేయరాని పనులు చేయించింది. పెళ్లి వయసు వచ్చిన తనకి పెళ్లి చేయకుండా వాడుకొన్నారు. పెళ్లైన తర్వాత తన తల్లి, ఇద్దరు సోదరులతో కలిసి ఇబ్బంది పెట్టిందని ట్విట్ చేసింది. తన సోదరులు మద్యానికి, డ్రగ్స్ కు బానిసలుగా మారి డబ్బు కోసం వేధించేవారని సంగీత ఆరోపించింది. తన తల్లి వారికీ వత్తాసు పలికేది పేర్కొంది. ఇటీవలే సంగీత తమ్ముడు మృతి చెందాడు. సంగీతపై ఆమె తల్లి ఫిర్యాదు చేయడం కంటే.. తల్లిపై సంగీత చేసిన కామెంట్స్ షాక్ కి గురి చేస్తున్నాయి.

తెలుగులో కృష్ణవంశీ ‘ఖడ్గం’ చిత్రం సంగీతకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆమె పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషీగా, సంక్రాంతి లాంటి కుటుంబ కథా చిత్రాలో నటించింది. 2009లో వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకి దూరమైంది. ప్రస్తుతం టీవీ షోస్ చేస్తున్న సంగీత సినిమాల్లో రీ-ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.