#AA19 క్లాప్ పడింది


ఎట్టకేలకు అభిమానుల కోరిక తీర్చాడు స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్. ఆయన 19వ చిత్రం ఈ ఉదయం ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకొంది. అల్లు అర్జున్ ముహూర్తపు షాట్ తో చిత్రాన్ని ప్రారంభించడం విశేషం. జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత త్రివిక్రమ్-బన్నీ కలయికలో రాబోతున్న సినిమా ఇది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ తో కలిసి హారిక & హాసినీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.

ఈ చిత్రం కోసం బన్నీ కొత్త లుక్ లోకి మారిపోయాడు. కాస్తబడి పొడవాటి జుట్టుతో కనిపిస్తున్నాడు. సంక్రాంత్రి బుల్లోడు టైపులో ఆయన గెటప్ ఉంది. ‘దేశముదురు’ సినిమా లుక్ మాదిరిగా హెయిర్ స్టయిల్ ఉంది. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. సినిమా ప్రారంభోత్సవానికి ఆమె హాజరుకాలేదు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం థమన్ మాంఛి ఫామ్ లో ఉన్నారు. అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ నెల 24 సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.