జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో వరుస ఎన్నికల జాతర నడుస్తోంది. కొద్ది నెలల క్రితమే శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. రెండ్రోజుల క్రితమే రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఆ ఓట్ల లెక్కింపు చేపట్టకముందే మరో ఎన్నికలు వచ్చాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలొచ్చాయ్. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంలోని మొత్తం 5857 ఎంపీటీసీ స్థానాలు, 535 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. మూడు విడతలుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ జరగనున్నాయి. మే 6వ తేదిన తొలి విడత పోలింగ్, మే 10వ తేదిన రెండో విడత పోలింగ్, మే 14వ తేదిన మూడో విడత పోలింగ్ జరగనుంది. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాతే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల ప్రాతిపదికగానే జరగనున్నాయి.