ఐకాన్ హీరోయిన్ అలియా

బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఐకాన్ హీరోయిన్ అనే ప్రచారం జరుగుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘ఐకాన్’ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు. బన్నీ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతం తివిక్రమ్ డైరక్షన్ లో బన్నీ సినిమా తెరకెక్కుతోంది.

తరువాత దిల్ రాజు నిర్మాణంలో, వేణు శ్రీరామ్ డైరక్షన్ లో బన్నీ సినిమా ‘ఐకాన్’ ఉండనుంది. ‘కనబడుటలేదు’ అన్నది సినిమా ట్యాగ్ లైన్. బౌండ్ స్క్రిప్ట్ తో డైరక్టర్ రెడీగా వున్నారు. సినిమా స్టార్ట్ చేస్తే మూడు నెలల్లో తీసి పక్కన పెట్టడమే. అందుకే ఈ సినిమాకు ఇప్పటి నుంచే అన్నీ రెడీ చేస్తున్నారు. ఈ సినిమా కోసం అలియాభట్ ని తీసుకోవాలని బన్నీ దిల్ రాజుకు సూచించాడట.

ప్రస్తుతం దిల్ రాజు అదే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.#RRR సినిమాతో అలియా తెలుగు తెరకు పరిచయం అవుతుంది. ఈ సినిమా కోసం ఏకంగా రూ. 5కోట్ల పారితోషికం తీసుకుంటుంది. ఆ రేంజ్ లో ఇస్తే ఐకాన్ కు ఆమె ఓకే చెప్పొచ్చు. ఏదేమైనా #RRR సినిమాతో అలియా పొందిన సంతృప్తి ఆధారంగానే ‘ఐకాన్’ సినిమాని ఆఫర్ పై ఆమె నిర్ణయం తీసుకోవచ్చు.