తమన్నా.. తమిళ దెయ్యం !

తెలుగులో చిన్న కామెడీ హారర్ చిత్రంగా వచ్చిన ‘ఆనందో బ్రహ్మ’ మంచి విజయాన్ని అందుకొంది. ఈ చిత్రానికి దర్శకుడు మహి వీ.రాఘవ్‌. తాప్సీ తో మరి నలుగురు కమిడియన్స్ ని ప్రధాన పాత్రలుగా తీసుకుని ఈ సినిమా ని రూపొందించారు. ఆ సినిమాలో తాప్సీ దెయ్యంగా కనిపించింది. ఇప్పుడీ ఈ సినిమా తమిళ్ లో రిమేక్ కానుంది.

తమిళ్ రిమేక్ కి మాతృక దర్శకుడు మహి. వీ రాఘవ దర్శకత్వం వహించనున్నారు. తాప్సీ నటించిన పాత్ర కోసం తమన్నాని తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో తాప్సీని తెలుగు దెయ్యం, తమన్నాని తమిళ దెయ్యంగా పిలుచుకొంటున్నారు. తమిళ్ ఆనందో బ్రహ్మా గురించి పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.